
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు ఈ నెల 13 నుంచి 25 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.పెనాల్టీ రూ.50తో ఈ నెల 26 నుంచి డిసెంబరు 3 వరకు.. పెనాల్టీ రూ.200తో డిసెంబరు 4 నుంచి 10 వరకు.. పెనాల్టీ రూ.500తో డిసెంబరు 11 నుంచి 15 వరకు చెల్లించవచ్చు.ఎక్కువ మంది చివరిలో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే సర్వర్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని, ప్రధానోపాధ్యాయులు ముందుగానే ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఫీజును https://bse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చెల్లించాలన్నారు.
