జె సి ఐ తిరుపతి ఒడిస్సి 2026 ప్రెసిడెంట్ గా శ్రీమతి నెల్లూరు మునిలక్ష్మిజె సి ఐ తిరుపతి ఒడిస్సి 2026 ప్రెసిడెంట్ గా శ్రీమతి జెసిఐ నెల్లూరు మునిలక్ష్మీ గారు బాధ్యత తీసుకోవడం జరిగింది . 26/11/2025 రోజున తిరుపతిలోని హోట ల్ రామి గెస్ట్ లైన్ లో సాయంత్రం 4 గంటలకు జరిగినటువంటి ఇన్స్టాలేషన్ ప్రోగ్రాంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు ఉమ వెన్నం గారు శ్రీమతి జె సి ఐ నెల్లూరు మునిలక్ష్మి గారికి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం లో గౌరవ అతిధిలుగా విచ్చేసిన జె సి ఐ ఇంటర్నేషనల్ చైర్మన్ కమిషన్ జె సి ఐ ఇండియా జె ఎఫ్ జె డాక్టర్ ఎన్.బి హర్షవర్ధన్ రెడ్డి గారు , అతిథులుగా విచ్చేసినటువంటి 2026 జోన్ 26 ప్రెసిడెంట్ జె సి ఐ సనేటర్ కె ప్రమోద్ కుమార్ గారు , స్పీకర్గా విచ్చేసినటువంటి జెసిఐ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్ జెసిఐ ఇండియా, జెసిఐ సనేటర్ జి యల్ మనోహర్ గారు, జె సి ఐ 2026 జోన్ 26 జోన్ చైర్మన్ జె ఎఫ్ ఎం ప్రదీప్ కొడాలి గారు, 2026 జోన్ వైస్ ప్రెసిడెంట్ జె ఎఫ్ ఎమ్ డాక్టర్ జి హరిప్రసాద్ గారు, చాప్టర్ ప్రెసిడెంట్ సనేటర్ డాక్టర్ నీరజ గారు హాజరు కావడం జరిగింది. 2025 జె సి ఐ తిరుపతి ఒడిసి ప్రెసిడెంట్ జె ఎఫ్ డి ఈ త్రిశల గారు జె సి ఐ శ్రీమతి నెల్లూరు మునిలక్ష్మి గారికి కాలర్ అందించి, ఆల్ ది బెస్ట్ చెప్పి బాధ్యతలు అప్పగించడం జరిగింది. 2026 సెక్రటరీగా మహిమ గారు, ట్రెజరర్ గా హేమ ప్రియా వారిని ఎన్నుకోవడం జరిగింది. ఫాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ లావణ్య రెడ్డి గారు , రాజేష్ గారు, ఎల్ జి బి మెంబర్స్ , జూనియర్ జెసిఐ వింగ్ జాన్ డైరెక్టర్ రాజా రెడ్డి గారు, మెంబర్స్ , అందరూ కూడా వారి వారి బాధ్యతలను స్వీకరించడం జరిగింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆచార్య ఉమా వెన్నం గారు మాట్లాడుతూ జే సి ఐ తిరుపతి ఒడిసి చేసేటువంటి ప్రతి కార్యక్రమాలలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యం చేసుకొని మహిళలకు సంబంధించి ట్రైనింగ్స్, సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అన్నీ కూడా చేద్దామని చెప్పారు. అలాగే మహిళలు ప్రతి ఒక్క దాంట్లో ముందున్నారంటూ… చెబుతూ ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మవిశ్వాసం పెంపొందేలా మనం చేసేటువంటి ఒక్క కార్యక్రమమైన పదిమందికి ఉపయోగపడే విధంగా ఉండాలంటూ సూచనలు కూడా ఇచ్చారు…. జె సి ఐ తిరుపతి ఒడిసి శ్రీమతి నెల్లూరు మునిలక్ష్మీ గారికి అభినందనలు తెలియచేశారు.. కార్యక్రమంలో వివిధ సంస్థల వారు మరియు వ్యాపారవేత్తలు అందరూ కూడా పాల్గొన్నారు.విచ్చేసిన అతిధులందరికీ కూడా శ్రీ దివ్యాంగ్ సేవా కేంద్రం ఆడవారు, స్పెషల్ చిల్డ్రన్ వేసినటువంటి పెన్ కలంకారి శాలువాలు , మరియు అర్చన గారు గాయత్రి గారు వేసినటువంటి చిత్రపటాలు బహుకరించడం జరిగింది…



