ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు 120 చోట్ల తనిఖీలు చేపట్టింది. విశాఖపట్నంలోని మధురవాడ, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట, పల్నాడు జిల్లా నరసరావుపేటతో సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి
దాడుల సమయంలో పలుచోట్ల ఏజెంట్లు పరారయ్యారు. ఒంగోలులో ఓ వ్యక్తి కిటికీలోంచి రూ. 30,000 విసిరేయగా, ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులో సీనియర్ అసిస్టెంట్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రికార్డులు, నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ, అవినీతికి సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తోంది.
ఏపీ వ్యాప్తంగా రెండోరోజు ఏసీబీ సోదాలు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు
ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు గుర్తింపు
డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్‌లో ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ
లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న ACB
