పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంచటంలో ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర ఆర్టీఐ కమీషనర్ డా. రెహానా బేగం పిలుపు

పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంచటంలో ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర ఆర్టీఐ కమీషనర్ డా. రెహానా బేగం పిలుపునిచ్చారు. పుస్తకాలు చదవటం వల్ల పిల్లల్లో భాషా నైపుణ్యాలు, సృజనాత్మకత పెరుగుతాయని అన్నారు. పాఠశాలల్లో ప్రతి రోజు రీడింగ్ అవర్, ప్రతి వారం స్టోరీ అవర్ నిర్వహించటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. మరో గ్రంధాలయ ఉద్యమం నేతృత్వంలో పాఠశాలలు, కళాశాలల్లో పుస్తక పఠనం ఆవశ్యకత పై జరిగిన చర్చా గోష్టిలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటారని అన్నారు విజయవాడ రీజన్ ఆర్పీఎఫ్ సీఐ మధుసూధన రావు. పుస్తకాలు చదివే అలవాటు పెరిగితే పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం నుంచి బయటపడతారని, ప్రతి విద్యార్ధిలో ఉండే విభిన్నమైన నైపుణ్యాలు బయటకు వస్తాయని మరో గ్రంథాలయ ఉద్యమం మంచికంటి వెంకటేశ్వర రావు అన్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేస్తే పాఠశాలల్లో లైబ్రరీ అవర్ సమర్థవంతంగా అమలు అవుతుందని ఏపీటీఎఫ్ ప్రతినిధి టీ. నాగరాజు పేర్కొన్నారు. టీచర్లు, ప్రిన్సిపల్స్ చిత్తశుద్ధితో పని చేసి ప్రతి స్కూల్ లో లైబ్రరీలు, రీడింగ్ కల్చర్ పెంచాలని పీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రసన్న అన్నారు. విజయవాడలోని విద్యాంజలి హైస్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మణ రావు, వీరప్పయ్య, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!