ఏపీ లో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం….సబ్సిడీపై ఈ-బైక్, ఈ-ఆటో..!

ఏపీ లో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు (DWCRA Women) E-Bike & E-Auto సబ్సిడీ అందిస్తోంది. ఇందులో E-Bike కొనుగోలు చేస్తే ₹ 12,000 సబ్సిడీ, E-Auto కొనుగోలు చేస్తే: ₹30,000 సబ్సిడీ అందిస్తోంది. పెట్టుబడి లేకుండా బ్యాంక్ రుణం పొందే అవకాశం కల్పిస్తారు. Rapido ద్వారా నెలకు ₹25,000 – ₹30,000 ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఉచిత డ్రైవింగ్ శిక్షణ కూడా అందుబాటులో ఉంచుతున్నారు.

దీనికి ప్రధాన అర్హత డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు అయి ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 21 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. దరఖాస్తు చేసేందుకు జిల్లా మెప్మా కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, డ్వాక్రా ఐడీ సమర్పించాలి. అలాగే దరఖాస్తు ఫారం నింపాలి. 15 రోజుల్లో లబ్దిదారుల్ని ఎంపిక చేస్తారు. ఎంపికైతే E-Bike లేదా E-Auto అందజేస్తారు.

అయితే ఈ పథకం ప్రస్తుతం విజయవాడ , విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, కర్నూలులోనే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర పట్టణాలకు విస్తరిస్తారు. డ్వాక్రా మహిళలకు నిత్యం ఎక్కడో చోటికి ప్రయాణిస్తూ తమ గ్రూపు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు దీని ద్వారా అవకాశం ఉంటుంది. ఇప్పటికే మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమల్లో ఉంది. అయితే తక్కువ దూరాలకు, బస్సు రూటు లేని చోట్ల ఈ ఈ-బైక్, ఈ-ఆటోలు వారికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!